
పెద్దమందడి, వెలుగు: ఎంపీడీవో ఆఫీస్ ఆవరణలో ఇందిరమ్మ మోడల్ హౌస్ కు మంగళవారం కాంగ్రెస్ నాయకులు భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ రఘుప్రసాద్ మాట్లాడుతూ.. గత ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పేరుతో ప్రజలను మోసం చేసిందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు ఇస్తుందని, విపక్షాలు చెప్పే మాటలు నమ్మి మోసపోవద్దని కోరారు. మార్కెట్ వైస్ చైర్మన్ రామకృష్ణారెడ్డి, మాజీ జడ్పీటీసీ వెంకటస్వామి, మాజీ సర్పంచ్ వెంకటస్వామి, గట్టు యాదవ్, పుల్లన్న, రవి, వడ్డే వెంకటేశ్ పాల్గొన్నారు